పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ

పూసర్ల వెంకట సింధు- తెలుగు తేజం

పూసర్ల వెంకట సింధు జులై 5 న 1995 లో మన తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో పుట్టింది. బాస్కెట్ బాల్ ఆటలో ప్రసిద్ధి చెందిన పి.వి రమణ, పి. విజయ ఈమె తల్లిదండ్రులు. 

తండ్రి, తల్లి ఇద్దరు ఆటగాళ్ళు కావడంతో చిన్నప్పటి నుంచి సింధు కు కూడా ఆటలపై ఆశక్తి పెరిగింది. 

సింధు తన 8 వ ఏట నుంచే బ్యాట్మింటన్ ఆడడం ప్రారంభించింది. ఆ ఆటపై పట్టు సాధించడానికి చాలా శ్రమించింది. 

2012 సెప్టెంబర్ 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో సింధు చోటు దక్కించుకుంది. ఇది ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది.

2013 ఆగష్టు 10న చైనాలో, అంతర్జాతీయ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్షిప్ లో సింధు పాల్గోని, ఒక పతకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించి, భారతదేశం గర్వపడేలా చేసింది.

2016 లో జరిగిన రియో. ఒలింపిక్ క్రీడల్లో రజతం సాధించింది. రియో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ వనితగా రికార్డు సృష్టించింది. ఇది మాత్రమే కాక, రియో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది.

పి.వి సింధు 2016, , ఆగష్టు 18న జరిగిన రియో ఒలింపిక్స్ సెమి ఫైనల్స్ లో జపాన్కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి, ఒలింపిక్ క్రీడలలో బ్యాడ్మింటన్ ఆట విభాగంలో ఫైనల్స్కు చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 

2019 లో జరిగిన బ్యాడ్మింటన్ ఆటల్లో కాంస్య పతకం గెలిచింది. ఈ అంతర్జాతీయ చాపియన్షిప్ కాంస్యం గెలిచినందుకు ఆమెకు “ఇండియాస్ గోల్డెన్ గాల్” అనే బిరుదును ఆమె అభిమానులు ఆమెకు ఇచ్చారు. 

ఇండోనేషియాకు చెందిన బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ క్లబ్ సింధు కు “మిస్ మల్లిక” అని ముద్దు పేరును పెట్టారు. 

సింధూ, తన 8వ ఏట నుంచి ఇప్పటి వరకు 411 మ్యాచ్లు గెలిచింది. 168 ఆటలు ఓడింది. 

చైనాకు చెందిన చెన్ యు ఫై, తర్వాత ప్రపంచంలోనే ఉత్తమ బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణిగా  2వ స్థానం సంపాదించింది.

27 సంవత్సరాల సింధును, మన భారత దేశ ప్రభుత్వం పద్మ భూషన్, పద్మ శ్రీ, అవార్డులతో సత్కరించింది. 

2020 లో పద్మ భూషన్, 2015 లో పద్మశ్రీ ని అందుకున్న పి.వి సింధూ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలో కెక్కింది. ఆంధ్ర ప్రదేశ్ -ప్రభుత్వం ఈమెకు డిప్యుటి కలెక్టర్ గా ఉద్యోగం ఇచ్చింది.

GRAZIA, JFW, ELLE లాంటి ప్రసిద్ధి గాంచి మెగజిన్స్ యొక్క కవర్ పేజ్ పై కూడా సింధును ముద్రించారు “గాల్ ఆఫ్ ది ఇయర్” “ది అన్ స్టాపబుల్ “- పి.వి. సింధున అనే క్యాప్షన్స్ తో ప్రచురించారు. 

అతి చిన్న వయస్సులోనే దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ 27 సంవత్సరాల అమ్మాయి మన సింధూ, మన తెలుగు తేజం కావడం, ప్రతీ తెలుగు వారికీ గర్వకారణమైన విషయం.

Leave a Comment

పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ