దాహం తెలిపే స్మార్ట్ గ్లాస్.
మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ద్రవపదార్ధాలు అవసరమని మనకి డాక్టర్లు చెబుతూఉంటారు.
ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. కొందరికి నీళ్ళు తాగడానికి బద్ధకం. కొందరు అవసరం ఉన్నా లేకపోయినా తాగుతూనే ఉంటారు. ఈ రెండు కూడా అంత మంచిది కాదు.
ఇంతకీ ఏది కరెక్ట..?
మీ దగ్గర ఇంటెలిజెంట్ కప్ ఉంటే సరి. మీకు ఎప్పుడు ఎన్ని నీళ్లు త్రాగడానికి అవసరమో అదే చెప్తుంది.
స్మార్ట్ వాచ్ యాప్ ద్వారా శరీరంలోని నీటి శాతాన్ని గుర్తించి మీకు ఎప్పటికప్పుడు సంకేతాలిస్తుంది . అప్పుడు మీరు మంచి నీళ్ళు తాగి వస్తే సరిపోతుంది.
ఎన్ని నీళ్లు తాగాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇంటెలిజెంట్ కప్ మీద ఒక చిన్న బల్బ్ మీటర్ ఉంటుంది. మీరు ఈ ఇంటెలిజెంట్ కప్పులో నీళ్ళు పోసినప్పుడు మీ శరీర అవసరాలకు ఎంత కావాలో సరిగ్గా అక్కడి వరకు వచ్చేసరికి లైట్ వెలుగుతుంది. దీని ద్వారా మనం సులువుగా ఎంత శాతం నీరు తాగాలో తెలుసుకోవచ్చు.