సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ:
ప్రపంచ క్రీడా చరిత్రలో ఎంతో పేరుపొందిన సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వారు ఎవరుండరు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందిన వ్యక్తి సచిన్ టెండుల్కర్.
సచిన్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. చినప్పట్నుంచి సచిన్ క్రికెట్ పై ఎంతో ఆశక్తిని కనబరిచేవాడు. సచిన్ కు క్రికెట్ పై ఎంత ఇష్టం ఉందంటే, తనకి క్రికెట్ సాధనలో బోర్ కొట్టినప్పుడు కూడా దాన్ని ఆపకుండ క్రికెట్ కోచ్ స్టంప్స్ పై ఒక నాణెం పెట్టి తనని ఓడించిన వారికి ఆ నాణెం ఇచ్చేవాడు. అలా తనకి తానే ఒక చాలెంజ్ ఏర్పరచుకునేవాడు.
1988లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబయి తరపున ఆడుతు గుజరాతపై 100 పరుగులు సాధించాడు. తను ఆడిన మొదటి మ్యాచ్‌లలోనే సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు.
సచిన్ రాయడంలో ఎడమ చేతివాటం అయినా బ్యాటింగ్, బౌలింగ్ లో కుడిచేతిని ఉపయోగించేవాడు.
సచిన్ ప్రతిభ 1994 – 1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. ఎన్నో మ్యాచ్‌లలో తన ప్రతిభను కనబరిచి మన దేశానికి మరింత కీర్తిని సాధించాడు.
1996 ప్రపంచ కప్‌లో తన ప్రతిభను కనబరుస్తు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్మన్ గా నిలిచి, 2 శతకాలు సాధించాడు.
ప్రముఖ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కోని బౌండరీలు దాటించడంవల్ల సచిన్ టెండూల్కర్ ని షేన్ వార్న్ కు – సింహస్వప్నంగా పిలుస్తారు.
2003-2004 లో భారత-ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.
జులై 28, 2007 లో 11000 పరుగులు పూర్తిచేసి మూడవ బ్యాట్స్ మెన్‌గా పేరు పొందారు.
తన క్రికెట్ ప్రతిభకు ఫలితంగా అర్జున అవార్డు, పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేతరత్న, పద్మవిభూషణ్ లాంటి అవార్డులను పొందారు.