చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది. ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం.
ఒక మంచి పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుస్తకాల నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు.
పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం చదివేవారికి మాత్రమే తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అలవాటు ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఆలోచిస్తారు.
పుస్తకం చదవడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
- బైబిల్
5 బిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో బైబిల్ మొట్టమొదటి స్థానంలో ఉంది. మానవ చరిత్రలో అత్యధికంగా అనువదించబడిన పుస్తకం బైబిల్. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 5 బిలియన్ కాపీలు అమ్మబడ్డాయి. బైబిల్ ఎం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో బైబిల్ నిలిచిపోయింది.
- చైర్మన్ మావో త్సే-తుంగ్ కొటేషన్స్.
1.1 బిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండవ పుస్తకం చైర్మన్ మావో త్సే-తుంగ్ కొటేషన్స్. “లిటిల్ రెడ్ బుక్” అని కూడా పిలువబడే చైర్మన్ మావో త్సే-తుంగ్ కొటేషన్స్ ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ కాపీలు అమ్మబడినవి. పుస్తకంలో 33 విభిన్న అంశాలపై 427 కోట్స్ ఉన్నాయి.
- ఖురాన్
800 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ఇప్పటి వరకు దాదాపు 800 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఖురాన్ 7వ శతాబ్దం CEలో అరబిక్‌లో వ్రాయబడింది.
ఖురాన్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మతానికి ఆధారం: ఇస్లాం.
- లార్డ్ ఆఫ్ ది రింగ్స్
155 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రచయిత జాన్ టోల్కీన్. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన నవల.ఈ రోజు వరకు, ఇది ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ కాపీలు అమ్ముడైంది.
- ది లిటిల్ ప్రిన్స్ (లే పెటిట్ ప్రిన్స్)
140 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ఫ్రెంచ్ పుస్తక రచయిత ఆంటోయిన్ డి సెయింట్-ఎక్సుపెరీ, చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ పుస్తకాన్ని రాశారు.
అత్యధికంగా అమ్ముడైన పిల్లల పుస్తకం ది లిటిల్ ప్రిన్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ కాపీలు అమ్ముడయ్యి.
- హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్
125 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ రచయిత పేరు J.K. Rowling. హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ 125 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
- స్కౌటింగ్ ఫర్ బాయ్స్
120 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
స్కౌటింగ్ ఫర్ బాయ్స్ పుస్తకం రచయిత పేరు రాబర్ట్ బాడెన్-పావెల్. స్కౌటింగ్ ఫర్ బాయ్స్ 120 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
- అండ్ తేన థెరె వర్ నన్.
115 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
అండ్ తేన థెరె వర్ నన్ పుస్తకం రచయిత పేరు అగాథ క్రిస్టి. అండ్ తేన థెరె వర్ నన్ 120 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
- హాబిట్
110 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
హాబిట్ పుస్తకం రచయిత పేరు జాన్ టోల్కీన్. హాబిట్ 110 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
- ది డ్రీం ఆఫ్ ది రెడ్ ఛాంబర్ (హోంగ్లోమెంగ్)
105 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ది డ్రీం ఆఫ్ ది రెడ్ ఛాంబర్ పుస్తకం రచయిత పేరు Cao Xueqin. 105 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
ఇవి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.