# 7to7telugu > Telugu News & Entertainment ## Posts - [ఉసిరికాయ (Amla) ఆరోగ్య ప్రయోజనాలు | Amla Health Benefits in Telugu](https://7to7telugu.com/usirikaya-amala-health-benefits-in-telugu/): నమస్తే మిత్రులారా! రోజుకో ఉసిరికాయ (Amla) తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. రోగనిరోధక శక్తి పెంచడానికి, జుట్టు, మరియు చర్మ సౌందర్యానికి ఇది ఎలా పనిచేస్తుందో చదవండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది కదా? ప్రతి చిన్న అనారోగ్యానికీ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కన్నా, మన ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఒక అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఉసిరికాయ (Indian Gooseberry / Amla). ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఉసిరిని ఒక దివ్యౌషధంగా వాడుతున్నారు. మరి ఈ చిన్న పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటో, దీన్ని మన రోజువారీ డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం! ఉసిరికాయ – పోషకాల గని! ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ... Read more - [Advantages and Disadvantages of Mobile Phones in telugu](https://7to7telugu.com/advantages-and-disadvantages-of-mobile-phones-in-telugu/): ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ సాధనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మొబైల్ కనెక్షన్‌లు వాడుతున్నారు. ఇవి సంభాషణ, విద్య, ఆర్థిక మరియు ఆరోగ్య సేవలతో పాటు వినోదానికి కూడా కీలక సాధనంగా మారాయి. గ్లోబల్ మొబైల్ ఎకానమీకి, మొబైల్ టెక్నాలజీలు గణనీయమైన స్థూల జాతీయోత్పత్తి (GDP)కి దోహదపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యాయి. అవి మనకు చాలా రకాలుగా సహాయం చేస్తాయి, కానీ వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే లాభాలు మరియు నష్టాల గురించి ఇక్కడ వివరించబడింది. మొబైల్ ఫోన్ల యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు మొబైల్ ఫోన్లు ఆధునిక జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. అవి మన రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేస్తాయి. అయితే, వాటి వాడకంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ వ్యాసంలో మొబైల్ ఫోన్ల వల్ల ... Read more - [క్రిస్మస్ గురించి || About Christmas In Telugu](https://7to7telugu.com/about-christmas-in-telugu/): క్రిస్మస్ గురించి || About Christmas In Telugu క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది యేసు క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, శాంతి, మరియు ఆనందాన్ని సూచిస్తుంది. తెలుగు సంస్కృతిలో కూడా క్రిస్మస్‌ను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ వ్యాసంలో క్రిస్మస్ గురించి తెలుసుకుందాము. క్రిస్మస్ చరిత్ర: క్రిస్మస్, యేసు క్రీస్తు జననాన్ని జరుపుకునే పండుగ. క్రైస్తవ విశ్వాసం ప్రకారం, యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా బెత్లెహేమ్ అనే ఊరిలో జన్మించాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్‌ను జరుపుకుంటారు. ఈ పండుగ చాలా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతోంది. క్రిస్మస్ జరుపుకునే విధానం క్రిస్మస్‌ను వివిధ రకాలుగా జరుపుకుంటారు: ప్రత్యేక ప్రార్థనలు: చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ కరోల్స్ (పాటలు) మరియు ఆరాధనలు జరుగుతాయి. బహుమతులు: కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ... Read more - [మన ఒలింపిక్ హీరో: నీరజ్ చోప్రా బయోగ్రఫీ](https://7to7telugu.com/neeraj-chopra-biography-in-telugu/): భారతదేశం గర్వించదగిన పేర్లలో ఒకటి నీరజ్ చోప్రా. మనం ఇష్టపడే క్రీడలో ఒక క్రీడాకారుడు విజయం సాధించినప్పుడు, అది మనలో కూడా ఒక కొత్త స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి స్ఫూర్తిని దేశవ్యాప్తంగా నింపిన పేరు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. జావెలిన్ త్రోలో ఆయన సాధించిన విజయాలు కేవలం క్రీడా పతకాలు మాత్రమే కాదు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ప్రపంచ వేదికపై తన సత్తాను ఎలా చాటవచ్చో నిరూపించిన విజయగాథ. నీరజ్ చోప్రా బయోగ్రఫీ –  జావెలిన్ త్రోలో భారతదేశపు స్వర్ణపుత్రుడు 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి, భారతదేశానికి అథ్లెటిక్స్‌లో 121 ఏళ్ల తర్వాత తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించాడు. అంతేకాకుండా, 2023లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా జీవిత చరిత్రను తెలుసుకుందాం. బాల్యం:  నీరజ్ చోప్రా ... Read more - [రోజు ఒక జామ పండు తింటే శరీరానికి కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు.](https://7to7telugu.com/health-benefits-of-eating-guavas/): జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ఈ పోస్ట్ లో మనం జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అందరికీ జామపండు అంటే ఇష్టమే. జామకాయ రుచికరమైన పండ్లలో ఒకటి. ఇవి మన ఇండ్లలో సాధారణంగా దొరుకుతాయి. అలా అని మనం చాలా లైట్ తీసుకుంటాం కానీ జామపండు వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  జామ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జామపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  కొలాజిన్ ఉత్పత్తి చేస్తుంది దాని ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జామపండులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది, జీర్ణశక్తికి ఎంతో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఫలం ఎంతో ఆరోగ్యకరం. జామపండు మీ దినచర్యలో ఒక మంచి పోషకమైన పండు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజు జామ ... Read more - [Success Tips - విజయం సాధించడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్లు](https://7to7telugu.com/bad-habits-to-quit-for-success-tips-in-telugu/):   విజయం సాధించడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్లు విజయం అనేది ప్రతి వ్యక్తి యొక్క దృష్టిలో అనేక విధాలుగా ఉంటది. అయితే, మనం అనుకుంటున్న విజయాన్ని పొందేందుకు కొన్ని చెడు అలవాట్లు ఆటంకమవుతాయి. వీటిని మనం జయిస్తే విజయం మనకి దక్కడం అగత్యం. విజయాన్ని పొందడానికి దూరం కావాల్సిన కొన్ని చెడు అలవాట్ల గురించి చర్చిద్దాం. 1. ఆలస్యంగా లేచే అలవాటు: ప్రతిరోజు సరిగ్గా ఒక స‌మయానికి లేవడం అనేది ఆరోగ్య శ్రేయస్సుల లక్షణం. ఈ లక్షణం ఉత్పాదకతకు కీలకమైన అంశం. ఆలస్యం చేయడం వల్ల రోజంతా మన ప్రణాళికలు పాడైపోతాయి. కాబట్టి, ఉదయం ప్రథమంగా ఉత్సాహంతో లేచి పనిచేయాలి. 2. సమయానికి పనులు పూర్తి చేయకపోవడం: పనులు చేస్తున్నప్పుడు సమయానికి పూర్తి చేయడం అనేది చాలా ముఖయం. పెరిగే పనుల వల్ల మనం ఒత్తిడిలో ఉంటాం మరియు ఆ పని నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ... Read more - [జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ? హానికరమ?](https://7to7telugu.com/junk-food-health-effects-in-telugu/): జంక్ ఫుడ్ ఆరోగ్యకరమ ? హానికరమ? అవును జంక్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి హానికరం. చాలామంది ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని తెలియక వాటికి బాగా అలవాటుపడ్డారు. Junk Food Meaning in Telugu: “జంక్” ఈ పదంలోనే ఉంది “చెత్త” అని. మనకి తెలియకుండానే మన శరీరంలోకి చెత్తని పంపిస్తున్నాము. ఈ జంక్ ఫుడ్ లో ఉండే ఫ్యాట్స్, కార్య్బహైడ్రేట్స్, సాల్ట్స్.. అన్ని అధికంగానే ఉంటాయి. ఈ జంక్ ఫుడ్ ని ఆన్లైన్లో సులభంగ మన దగ్గరకే తెప్పించేసుకొని తింటూవుంటాం. మనకి తెలియని విషయం ఏంటంటే జంక్ ఫుడ్ తో సులభంగా ఉంభకాయం, అజీర్తి, గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, అధిక బరువు, చిన్న వయస్సులోనే చనిపోవడం వంటి రోగాలను తెచ్చుకుంటున్నాము. మన దేశంలో 15-49 ఏళ్ళ మధ్య వయస్సు 4 శాతం మంది ఒబేసిటి సమస్యతో భాధపడుతుండగా, 20 శాతం మంది ఓవర్ వెయిట్ ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన ... Read more - [మిలిటరీ కోసం అద్భుతమైన రోబో సూట్.](https://7to7telugu.com/exoskeletion-lifts-weights-easily-specially-made-for-military/): ఎంత బరువునైనా లెక్క చేయదు: ఈ చిత్రం లో కనిపిస్తున్న రోబో సూట్ వేసుకుంటే మన శరీర బలం 17 రెట్లు పెరుగుతుంది.  100 కేజీల బరువును ఆరు కేజీల బరువులా ఎత్తిపడేస్తo. ఎందుకంటే ఈ బరువును మనపై పడకుండా అదే మోస్తుంది. సైనిక సామాగ్రి తయారు చేస్తున్నా Raytheon అనే అమెరికా కంపెనీ ఎక్సో స్కెలిటన్ పేరుతో దీన్ని తయారుచేసింది. ఈ సూట్ హైడ్రాలిక్ సాయంతో పనిచేస్తుంది. భారీ బాంబులు, బ్యారికేడ్లను తీసుకెళ్లేందుకు సైనికులకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. మరిన్ని ఆసక్తి కరమైన టెక్నాలజీ న్యూస్ కోసం మా వెబ్సైటు ను మరల visit చేయండి. - [దాహం తెలిపే స్మార్ట్ గ్లాస్](https://7to7telugu.com/smart-water-glass-reminds-you-to-drink-water/): దాహం తెలిపే స్మార్ట్ గ్లాస్. మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ద్రవపదార్ధాలు అవసరమని మనకి డాక్టర్లు చెబుతూఉంటారు. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. కొందరికి నీళ్ళు తాగడానికి బద్ధకం.  కొందరు అవసరం ఉన్నా లేకపోయినా తాగుతూనే ఉంటారు.  ఈ రెండు కూడా అంత మంచిది కాదు. ఇంతకీ ఏది కరెక్ట..? మీ దగ్గర  ఇంటెలిజెంట్ కప్ ఉంటే సరి.  మీకు ఎప్పుడు ఎన్ని నీళ్లు త్రాగడానికి అవసరమో అదే చెప్తుంది. స్మార్ట్ వాచ్ యాప్ ద్వారా శరీరంలోని నీటి శాతాన్ని గుర్తించి మీకు ఎప్పటికప్పుడు సంకేతాలిస్తుంది . అప్పుడు మీరు మంచి నీళ్ళు తాగి వస్తే సరిపోతుంది. ఎన్ని నీళ్లు తాగాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇంటెలిజెంట్ కప్ మీద ఒక చిన్న బల్బ్ మీటర్ ఉంటుంది. మీరు ఈ ఇంటెలిజెంట్ కప్పులో  నీళ్ళు పోసినప్పుడు మీ శరీర అవసరాలకు ఎంత కావాలో సరిగ్గా అక్కడి వరకు వచ్చేసరికి లైట్ వెలుగుతుంది. దీని ... Read more - [సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ](https://7to7telugu.com/sachin-tendulkar-biography-in-telugu/): సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ: ప్రపంచ క్రీడా చరిత్రలో ఎంతో పేరుపొందిన సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వారు ఎవరుండరు.  చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందిన వ్యక్తి సచిన్ టెండుల్కర్. సచిన్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. చినప్పట్నుంచి సచిన్ క్రికెట్ పై ఎంతో ఆశక్తిని కనబరిచేవాడు. సచిన్ కు క్రికెట్ పై ఎంత ఇష్టం ఉందంటే, తనకి క్రికెట్ సాధనలో బోర్ కొట్టినప్పుడు కూడా దాన్ని ఆపకుండ క్రికెట్ కోచ్ స్టంప్స్ పై ఒక నాణెం పెట్టి తనని ఓడించిన వారికి ఆ నాణెం ఇచ్చేవాడు. అలా తనకి తానే ఒక చాలెంజ్ ఏర్పరచుకునేవాడు.  1988లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబయి తరపున ఆడుతు గుజరాతపై 100 పరుగులు సాధించాడు. తను ఆడిన మొదటి మ్యాచ్లలోనే సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. సచిన్ రాయడంలో ఎడమ ... Read more - [పూసర్ల వెంకట సింధు బయోగ్రఫీ](https://7to7telugu.com/pv-sindu-biography-in-telugu/): పూసర్ల వెంకట సింధు- తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జులై 5 న 1995 లో మన తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో పుట్టింది. బాస్కెట్ బాల్ ఆటలో ప్రసిద్ధి చెందిన పి.వి రమణ, పి. విజయ ఈమె తల్లిదండ్రులు.  తండ్రి, తల్లి ఇద్దరు ఆటగాళ్ళు కావడంతో చిన్నప్పటి నుంచి సింధు కు కూడా ఆటలపై ఆశక్తి పెరిగింది.  సింధు తన 8 వ ఏట నుంచే బ్యాట్మింటన్ ఆడడం ప్రారంభించింది. ఆ ఆటపై పట్టు సాధించడానికి చాలా శ్రమించింది.  2012 సెప్టెంబర్ 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో సింధు చోటు దక్కించుకుంది. ఇది ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. 2013 ఆగష్టు 10న చైనాలో, అంతర్జాతీయ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్షిప్ లో సింధు పాల్గోని, ఒక పతకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించి, ... Read more - [చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు.](https://7to7telugu.com/best-top-10-selling-books-in-history/):   చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది. ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం. ఒక మంచి పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుస్తకాల నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు.  పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం చదివేవారికి మాత్రమే తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అలవాటు ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఆలోచిస్తారు. పుస్తకం చదవడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.  ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు ఏవో ఇప్పుడు చూద్దాం. బైబిల్ 5 బిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో బైబిల్ మొట్టమొదటి స్థానంలో ఉంది. మానవ చరిత్రలో అత్యధికంగా అనువదించబడిన పుస్తకం బైబిల్. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 5 ... Read more ## Optional - [Agent (MCP protocol)](websites-agents.hostinger.com/7to7telugu.com/mcp) [comment]: # (Generated by Hostinger Tools Plugin)